త్యాగధనుల ఫలితమే..‘స్వాతంత్ర్యం’:శ్రీహరి
1 min read
విద్యార్థులు దేశ పోరాట యోధుల జీవితం.. స్పూర్తిదాయకం
- యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ బ్యాంకు చీఫ్ మేనేజర్ శ్రీహరి
పల్లెవెలుగు: ఎందరో పోరాట యోధుల ప్రాణత్యాగఫలితమే… స్వాతంత్ర్యం అని పేర్కొన్నారు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ శ్రీహరి. 77వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని నగరంలోని ఆదిత్య విద్యాలయం, గుడ్ షెప్పర్డ్ పాఠశాలలో వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్ పోటీలు నిర్వహించారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలో నిర్వహించిన వ్యాస రచన పోటీలలో ..దేశభక్తిని పెంపొందించుకోవాల్సిన ఆవశ్యకత, అజాదికా అమృత్ మహోత్సవాలు, దేశ ప్రగతిలో యువత కర్తవ్యం తదితర అంశాలపై నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకు చీఫ్ మేనేజర్ శ్రీహరి, మార్కెటింగ్ మేనేజర్ కేశవ రెడ్డి మాట్లాడుతూ దేశభక్తి.. స్వాతంత్ర్య పోరాట యోధుల గురించి విద్యార్థులు తెలుసుకోవాలన్నారు. స్వాతంత్ర్యం కోసం ఎందరో ప్రాణాలు అర్పించారని, వారి ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పోరాట యోధుల జీవిత చరిత్రను తెలుసుకొని… వారి అడుగు జాడల్లో నడవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో భాగంగా వ్యాసరచన పోటీలలో గెలుపొందిన వంశీ, వరుణ్సందేష్, ఎం. ఆదిత్య రవి, వకృత్వ పోటీలలో విహాన, శశి, ఆర్. పల్లవికి వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో బ్యాంకు సీనియర్ బ్రాంచ్ మేనేజర్ నాగమల్లేశ్వరుడు, ఆఫీసర్ గిరీష్, మేనేజర్ జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
