విద్యార్థినులు ఆత్మస్థెర్యంతో ముందుకు సాగాలి
1 min readబేటీ బచావో బేటీ పడావో పై అవగాహన
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: సమాజంలో ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలు, లింగవివక్షను ఎదుర్కోవడం, గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై విద్యార్థినులు అవగాహన కలిగి ఉండాలని ఐసీడీఎస్ సూపర్‌వైజర్ శేషమ్మ అన్నారు.గురువారం పగిడ్యాల మండలం సంకిరేణి పల్లి గ్రామంలోని అంగన్ వాడి కేంద్రంలో అలాగే ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థినులతో బేటీ బచావో బేటీ పడావో పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి పలు అంశాలపై అవగాహన కల్పించారు. వ్యక్తిగత పరిశుభ్రత, ఆకతాయిల నుంచి రక్షణ పొందే విధానంపై వివరించారు. విద్యార్థినులు ఆత్మస్థెర్యంతో ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వరప్రసాద్, అంగన్‌వాడీ టీచర్లు మల్లీశ్వరమ్మ, శ్రీలక్ష్మీ, పద్మమ్మ , గర్భిణీ స్త్రీలు ,బాలింతలు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.