PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

  ప‌ల్లె వెలుగు వెబ్ :       భారతదేశం ఇరాన్ నుంచి దిగుమతి అవుతున్న కివీ పండ్లను నిషేధించింది. తెగుళ్లు సోకిన కివీ పండ్లు ఇరాన్ నుంచి దిగుమతి అవుతుండటంతో భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది అక్టోబర్ నుంచి భారతదేశంలో 22 సరుకుల్లో తెగులు వచ్చింది. ఇరాన్ నుంచి తెగులు దేశంలోకి వస్తుండటంతో కేంద్ర వ్యవసాయమంత్రిత్వశాఖ ఆధీనంలోని నేషనల్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ ఈ నెల 7వతేదీ నుంచి కివీ పండ్ల దిగుమతిని నిషేధించింది. కివీ పండ్లను తమ దేశానికి పంపించవద్దని భారత్ ఇరాన్ సర్కారుకు తెలిపింది. కివీ పండ్ల ద్వారా తెగులు దేశంలోకి వస్తుందని పలుసార్లు భారత్ ఇరాన్ దేశానికి హెచ్చరికలు చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. 

              

About Author