70 వేల తుపాకులు కొన్న భారత్.. తాలిబన్ ఎఫెక్ట్ !
1 min readపల్లెవెలుగు వెబ్ : తాలిబన్లు ఆఫ్గనిస్థాన్ ను ఆక్రమించడంతో భారత్ అలర్ట్ అయింది. అమెరికా విడిచి వెళ్లిన ఆయుధాలు తాలిబన్లకు అందడంతో.. అవి కొన్ని ఉగ్రసంస్థలకు చేరే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. భారత వాయిసేన ఆయుధసంపత్తిని పెంచుకునే దిశగా భారత్ చర్యలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా రష్యా నుంచి 70వేల ఏకే-103 రైఫిళ్లను అత్యవసరంగా కొనుగోలు చేసింది. కొత్తగా కొనుగోలు చేసిన రైఫిళ్లు మరికొన్ని నెలల్లో భారత్ చేరుకుంటాయి. ఈ కొనుగోలు విలువ సుమారు 300 కోట్లు ఉంటుంది. జమ్మూకశ్మీర్, శ్రీనగర్ లాంటి సున్నిత ప్రాంతాల్లోని భద్రతా బలగాలకు వీటిని మొదటగా అందించనున్నారు. ఏకే-103 … ఏకే-47కి అప్ గ్రేడెడ్ వెర్షన్. భారత నేవీ వీటిని ఇప్పటికే వినియోగిస్తోంది.