మానవత్వం చాటుకున్న భారత్.. ఉక్రెయిన్ కు.. ?
1 min read
పల్లెవెలుగువెబ్ : రష్యా దాడితో సతమతమవుతున్న ఉక్రెయిన్ కు భారత్ బాసటగా నిలిచింది. యుద్ధ సమయంలో మానవత్వాన్ని చాటుకుంది. రెండు దేశాలతోను మంచి సంబంధాలతో తటస్థ వైఖరి అవలంబిస్తూనే యుద్ధాన్ని వ్యతిరేకిస్తోంది. అవసరమైన సాయాన్ని బాధిత ఉక్రెయిన్ దేశానికి అందిస్తోంది. ఉక్రెయిన్ అధ్యక్షుడి వినతి మేరకు అత్యవసరమైన మెడిసిన్లతోపాటు బ్లాంకెట్లు, టెంట్లు, సోలార్ ల్యాంప్స్ సహా ఇతర సామగ్రి అందించింది. పోలండ్ ద్వారా బుధవారం రెండు టన్నుల విలువైన మెడిసిన్స్‌ను ఉక్రెయిన్‌కు తరలించింది. త్వరలో రొమేనియా ద్వారా మరికొంత సాయం అందించేందుకు భారత్ సిద్ధమవుతోంది. అత్యవసరానికి వినియోగమయ్యే సామగ్రిని ఉక్రెయిన్‌కు తరలిస్తున్నట్లు కేంద్రం చెప్పింది. ప్రధాని మోదీ అధ్యక్షతన సోమవారం జరిగిన అత్యవసర సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఉక్రెయిన్, భారత్, రష్యా, మోదీ