పల్లె వెలుగు వెబ్ : ప్రపంచ వ్యాప్తంగా వినియోగించే టాప్ _100 లగ్జరీ వస్తువుల జాబితాలో భారత్ కు చోటుదక్కింది. ఈ ఏడాదికిగాను డెలాయిట్ గ్లోబల్ విడుదల చేసిన ఈ లిస్ట్‌లో టాటా గ్రూప్‌నకు చెందిన టైటాన్ 22వ స్థానా న్ని దక్కించుకుంది. గతసారితో పోలిస్తే మూడు స్థానాలు ఎగబాకింది. అంతేకాదు, అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న 20 లగ్జరీ గూడ్స్ కంపెనీల్లో ఒకటిగా నిలిచింది. భారత్‌ను చోటు లభించిన మిగతా లగ్జరీ బ్రాండ్లలో కల్యాణ్ జువెలర్స్ (37వ స్థానం), జోయాలుక్కాస్ (46), పీసీ జువెలర్స్ (57), త్రిభోవన్‌దా్‌స భీమ్‌జీ జవేరీ లిమిటెడ్ (92) ఉన్నాయి. దేశీయ కంపెనీల్లో అన్నీ జెమ్స్ అండ్ జువెలరీ రంగానికి చెందినవే కావడం గమనార్హం.