ట్విట్టర్ సీఈవోగా భారతీయుడు
1 min readపల్లెవెలుగు వెబ్: ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ట్విట్టర్ నూతన సీఈవోగా భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ నియమితులయ్యారు. ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే రాజీనామా చేశారు. పరాగ్ అగర్వాల్ ఐఐటీ బాంబే లో కంప్యూటర్ ఇంజినీరింగ్, స్టాన్ ఫోర్డ్ లో పీహెచ్డీ చదువుకున్నారు. ఈ పదవి చేపట్టడం తాను గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. జాక్ డోర్సేకు కృతజ్ఞతలు చెబుతూ…మీ మార్గదర్శనం, స్నేహం కొనసాగుతుందని భావిస్తున్నానని పరాగ్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. కపెంనీ బోర్డు చాలా తీవ్రంగా వెతికిందని, ఏకగ్రీవంగా పరాగ్ ను ఎంచుకుందని తెలిపింది. కంపెనీని, కంపెనీ అవసరాలను అతను లోతుగా అర్థం చేసుకున్నాడని డోర్సే తెలిపారు.