NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

భార‌త పౌర‌స‌త్వం.. దాయాదీ దేశం నుంచి ద‌ర‌ఖాస్తుల వెల్లువ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : భార‌త పౌర‌స‌త్వం కోసం విదేశీయుల నుంచి ఈ ఏడాది డిసెంబ‌ర్ 14 వ‌ర‌కు 10 వేల ద‌ర‌ఖాస్తులు వ‌చ్చినట్టు కేంద్ర హోంశాఖ ప్ర‌క‌టించింది. వీటిలో 7306 మంది పాకిస్థానీయులేన‌ని స్ప‌ష్టం చేసింది. అయితే.. పాకిస్థాన్ నుంచి వ‌చ్చిన ద‌ర‌ఖాస్తుల్లో 70 శాతం పెండింగ్ లో ఉన్న‌ట్టు హోంశాఖ తెలిపింది. ఎంపీ అబ్దుల్ వాహ‌బ్ అడిగిన ప్ర‌శ్న‌కు కేంద్ర హోంశాఖ స‌హాయ‌మంత్రి నిత్యానంద‌రాయ్ స‌మాధానం ఇచ్చారు. గ‌త నాలుగేళ్ల‌లో పాకిస్థాన్, ఆప్ఘ‌నిస్థాన్, బంగ్లాదేశ్ దేశాల‌కు చెందిన 3117 మంది మైనార్టీల‌కు దేశ పౌర‌స‌త్వం ఇచ్చిన‌ట్టు తెలిపారు. ఇదిలా ఉంటే.. గ‌త ఐదేళ్ల కాలంలో 6 ల‌క్ష‌ల మంది భార‌తీయులు దేశ పౌర‌స‌త్వం వ‌దులుకున్నార‌ని ఇటీవ‌ల కేంద్రం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

                                      

About Author