భారత నగల వ్యాపారి.. ‘నన్ను లోబరుచుకోవాలని చూశాడు’ !
1 min readపల్లెవెలుగు వెబ్: వజ్రాల వ్యాపారి మోహుల్ చోక్సీ కిడ్నాప్ విషయంలో పలు కీలక విషయాలు బయటికొస్తున్నాయి. తన కిడ్నాప్ కు తన స్నేహితురాలైన బార్బరా జబరికా కూడ కారణమని చోక్సీ ఆరోపించారు. ఈ నేపథ్యంలో చోక్సీ ప్రియురాలిగా పిలవబడే బార్బరా జబరికా స్పందించారు. తనకు , ఆ కిడ్నాప్ కు సంబంధం లేదని చెప్పింది. చోక్సీ పలుమార్లు తనకు విమాన్ టికెట్లు, హోటల్ రూమ్ లు బుక్ చేస్తానని బలవంతం చేశాడని జబరికా చెప్పింది. కానీ తనకు ఎలాంటి ఉద్దేశం లేనందున తిరస్కరించానని తెలిపింది. కేవలం చోక్సీతో వ్యాపారాన్నీ మాత్రమే కోరుకున్నానని, చోక్సీ ఆఫర్స్ ఒప్పుకుంటే … చోక్సీ తనను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉందని.. అందుకే చోక్సీ ఆఫర్స్ ని రిజెక్ట్ చేశానని చెప్పింది. తనతో కలిసి వ్యాపారం చేసేందుకు చోక్సీ ప్రయత్నించాడని, అంటిగ్వాలో హోటల్స్, క్లబ్స్ పెట్టేందుకు ఆసక్తిగా ఉండేవాడని బార్బరా జబరికా తెలిపింది.