NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఇంటికొస్తున్న ఉక్రెయిన్ సైన్యంలో చేరిన ఇండియ‌న్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : త‌మిళ‌నాడుకు చెందిన సాయి నిఖేశ్ ఉక్రెయిన్ లో పై చ‌దువుల కోసం వెళ్లాడు. ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడి నేప‌థ్యంలో ఉక్రెయిన్ సైన్యంలో చేరాడు. సాయినిఖేశ్ స్వస్థలం తమిళనాడులోని కోయంబత్తూర్. సాయినిఖేశ్ ప్రస్తుతం భారత్ తిరిగొచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడంటూ అతడి తండ్రి రవిచంద్రన్ తాజాగా స్థానిక మీడియాకు తెలిపారు. ‘‘ కేంద్ర ప్రభుత్వ అధికారులు మాతో టచ్‌లోనే ఉన్నారు. మా కుమారుడు ఎక్కడున్నాడో వెతికిపట్టుకుని సురక్షితంగా స్వదేశానికి తెస్తామని వారు మాటిచ్చారు. సాయినిఖేశ్‌తో నేను మూడు రోజుల క్రితం మాట్లాడాను. భారత్ తిరిగి వచ్చేందుకు సిద్ధంగానే ఉన్నట్టు తెలిపాడు. ఇక తమను ఏ సమయంలోనైనా సంప్రదించొచ్చని అధికారులు మాకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయమై మీడియాలో వచ్చే వార్తలు నా కుమారుడి రాకపై ప్రతికూల ప్రభావం చూపించకూడదని కోరుకుంటున్నా’’ అని రవిచంద్రన్ పేర్కొన్నారు.

                                 

About Author