NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆఫ్గాన్ ఘ‌ర్షణ‌ల్లో భార‌త జ‌ర్నలిస్టు మృతి

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఆఫ్గానిస్థాన్ దేశ బ‌ల‌గాల‌కు, తాలిబ‌న్లకు మ‌ధ్య జ‌రిగిన ఘ‌ర్షణ‌లో భార‌త ఫోటో జ‌ర్నలిస్టు, పులిట్జర్ అవార్డు గ్రహీత డానిశ్ సిద్ధిఖీ ప్రాణాలు కోల్పోయారు. కాంద‌హార్ లోని స్పిన్ బొల్డాక్ ప్రాంతంలో గ‌ల కీల‌క పాకిస్థాన్ స‌రిహ‌ద్దు ప్రాంతాన్ని తాలిబ‌న్లు ఇటీవ‌ల త‌మ ఆధీనంలోకి తీసుకున్నారు. గ‌త కొద్దిరోజులుగా ఆఫ్గాన్ బ‌ల‌గాల‌కు, తాలిబ‌న్లకు మ‌ధ్య ఘ‌ర్షణ‌లు జ‌రుగుతున్నాయి. రాయిట‌ర్ సంస్థలో ప‌నిచేస్తున్న డానిశ్.. ఈ ఘ‌ట‌న‌ల‌ను క‌వ‌ర్ చేస్తున్నారు. గురువారం రాత్రి జ‌రిగిన ఘ‌ర్షణ‌ల్లో ఆయ‌న మృతిచెందారు. డానిశ్ మృతిని భార‌త్ కు ఆఫ్గాన్ రాయ‌బారి ఫారిద్ మముంజ ట్విట్టర్ వేదిక‌గా ధృవీక‌రించి.. సంతాపం ప్రక‌టించారు.

About Author