PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇండియన్ రెడ్ క్రాస్ కి ల్యూకో సైట్ ఫిల్టర్ సెట్ అందజేత..

1 min read

ఏలూరు కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో..

లక్ష రూపాయలు విలువ గల వస్తువు అందజేయడం అభినందనీయం..

చైర్మన్ బివి కృష్ణారెడ్డి

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  : తల సేమియా రోగుల రక్తమార్పిడి సమయంలో ఉపయోగించే లక్ష రూపాయలు విలువ గల ల్యూకోసైట్ ఫిల్టర్ సెట్ లను ఏలూరు కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సభ్యులు రెడ్ క్రాస్ ప్రతినిధులకు అందజేశారని జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ బీవీ కృష్ణారెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ రక్త మార్పిడి సమయంలో తల సేమియా రోగులకు ఎటువంటి ప్రతి చర్యలు సంభవించకుండా ఉపయోగించే ప్రత్యేకమైన ఫిల్టర్ సెట్ లకు దాతల సహకారం కోరగా, ఏలూరు కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వారు స్పందించి 125 ఫిల్టర్ సెట్ లను అందించారని, ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ కార్యదర్శి కేబీ సీతారాం, డాక్టర్ ఆర్ఎస్ఆర్కే వరప్రసాదరావు, సీనియర్ అసిస్టెంట్ ఏ సూర్యనారాయణ, జిల్లా రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ వి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

About Author