NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

లాభాల బాట‌లో భార‌త్ స్టాక్ మార్కెట్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : భార‌త స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల బాట ప‌ట్టాయి. అంత‌ర్జాతీయంగా స్టాక్ మార్కెట్లలో సానుకూల సంకేతాల‌తో భార‌త స్టాక్ మ‌ర్కెట్ సూచీలు లాభాల్లోకి వెళ్లాయి. అమెరిక‌న్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఈ నేప‌థ్యంలో ఆసియా మార్కెట్లు సానుకూలంగా క‌ద‌లుతున్నాయి. కీల‌క రంగాల్లో కొనుగోళ్లకు ఇన్వెస్టర్లు మొగ్గు చూప‌డంతో భార‌త స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో కొన‌సాగుతున్నాయి. ఉద‌యం 10.59 నిమిషాల స‌మ‌యంలో నిఫ్టీ -129 పాయింట్ల లాభంతో 15,875 వ‌ద్ద ట్రేడ్ అవుతోంది. బ్యాంక్ నిఫ్టీ 330 పాయింట్ల లాభంతో 35,200 వ‌ద్ద ట్రేడ్ అవుతోంది. బ్యాంక్ నిఫ్టీలో 35000 స్థాయి వ‌ద్ద కీల‌క‌మైన స‌పోర్ట్ ఉంది. 35000 స్థాయి వ‌ద్ద పుట్ రైట‌ర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ‌గా ఉంది.

About Author