ప్రమాదంలో భారత టెక్ పరిశ్రమ !
1 min readపల్లెవెలుగువెబ్ : అమెరికాలో ఆర్థిక మాంద్యం ఏర్పడితే ఆ ప్రభావం భారతీయ టెక్ కంపెనీలపై భారీగానే పడే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే మన టెక్ దిగ్గజాలు మాత్రం అమెరికాలో ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం లేదని అభిప్రాయపడుతున్నాయి. ఉదాహరణకు ఇన్ఫోసిస్ సంస్థ తన రెవెన్యూ వృద్ధిని 14-16 శాతంగా అంచనా వేస్తోంది. గణాంకాలు మాత్రం అంత ఆశాజనకంగా కనిపించట్లేదని ఆర్థిక నిపుణులు అంటున్నారు. మళ్లీ ఇన్ఫోసి్‌సనే ఉదాహరణగా తీసుకుంటే గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంతో పోల్చుకుంటే ఈసారి ఆ సంస్థ రెవెన్యూ వృద్ధి 24 శాతంగా ఉన్నా అందులోంచి వడ్డీలు, పన్నుల భారం తీసేస్తే మిగిలిం ది గత ఏడాదితో పోలిస్తే 3 శాతం మాత్రమే ఎక్కువ.