NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఇండియ‌న్ వీర‌ప్ప‌న్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : డైరెక్టర్స్ డే సందర్భాన్ని పురస్కరించుకొని ప్రశాంత్ నీల్‌ పై రామ్ గోపాల్ వ‌ర్మ ప్ర‌శంస‌లు కురిపించారు. ‘ప్రశాంత్ నీల్ కు అన్ హ్యాపీ డైరెక్టర్స్ డే అని చెబుతున్నానని అన్నారు. ` బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్, ఆఖరికి శాండల్ వుడ్ దర్శకుల మైండ్ ను ‘కేజీఎఫ్ 2’ తో బ్లాక్ చేసి పడేశారు. ప్రశాంత్ సార్.. నిజంగా మీరు ఇండియన్ సినిమా ‘వీరప్పన్’. అని వర్మ ట్వీటింగ్‌ను స్టార్ట్ చేశారు. ‘ప్రశాంత్ నీల్ సార్.. మీరు ‘కేజీఎఫ్ 2’ తో క్వింటాళ్ళ డబ్బును కురిపించారు. అయితే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వందల క్వింటాళ్ళ డబ్బును రీషూట్స్ , రీ డ్రాఫ్ట్స్, రీథింక్స్ కోసం.. ఇంకా.. దర్శకులు వాళ్ళను వాళ్ళు రీ ఇన్వెంట్ చేసుకోడానికి తగలేస్తున్నారు. అయినా ‘కేజీఎఫ్ 2’ ఎందుకు హిట్టైందో ఇంకా తెలుసుకోలేకపోతున్నారు… అంటూ మరో ట్వీట్ లో తెలిపారు వర్మ.

                                           

About Author