NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

తాలిబ‌న్ల చెర‌లో ఇండియ‌న్స్ ?

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఆప్గనిస్థాన్ ను ఆక్రమించుకున్న తాలిబ‌న్లు కాబూల్ విమానాశ్రయంలో భార‌తీయుల్ని కిడ్నాప్ చేశార‌నే వార్తలు క‌ల‌కల‌ం సృష్టించాయి. ఆప్ఘన్ నుంచి భార‌త్ వ‌చ్చేందుకు వీరంద‌రూ కాబూల్ విమానాశ్రయానికి వ‌చ్చారు. 150 మంది ప్రయాణీకుల్ని తాలిబ‌న్లు కిడ్నాప్ చేశార‌నే వార్తలు వ‌చ్చాయి. వీరిలో ఎక్కువ‌గా భార‌తీయులు ఉన్నట్టు తెలిసింది. భార‌త విదేశాంగ శాఖ వెంట‌నే అప్రమ‌త్తమై.. సంప్రదింపులు జ‌రిపింది. అయితే.. ప్రయాణీకుల వ‌ద్ద ఉన్న ప‌త్రాలు ప‌రిశీలించేందుకే వారిని తీసుకెళ్లిన‌ట్టు తెలిసింది. త‌నిఖీల అనంత‌రం వారిని తాలిబ‌న్లు విడుద‌ల చేశార‌ని, త్వర‌లో వారు ఇండియాకు రానున్నార‌ని స‌మాచారం. అయితే.. కిడ్నాప్ వార్తలు అవాస్తవ‌మ‌ని తాలిబ‌న్ల ప్రతినిధులు మీడియాకు వెల్లడించారు.

About Author