PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భారతదేశ తొలి మహిళా సంఘ సంస్కరిణి సావిత్రిబాయి పూలే

1 min read

జిల్లా పరిషత్ ఉన్నత పాటశాలలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగింది,

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : సమాజంలోని కులతత్వం, పురుషాధిక్యత ధోరణులు కలిగిన చాలామంది పండిత మేధావులందరికీ కూడా సావిత్రిబాయి కేవలం జ్యోతిరావు పూలే భార్యగా మాత్రమే తెలుసు. కానీ సావిత్రిబాయి ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు.., పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి.. స్త్రీల విముక్తి కోసం అహర్నిశలు శ్రమించిన నాయకి, గొప్ప రచయిత్రి.మంచి వక్త.. కులం, పితృస్వామ్యంపై కలం యుద్ధం నడిపిన కవయిత్రి.. యుక్తవయసులోనే తన సౌఖ్యాలను వదులుకొని శూద్రులకు, దళితులకు పాఠశాలలు నడిపిన గొప్ప మానవి. స్త్రీపురుషులు కులమతాలకతీతంగా విద్యనభ్యసించడం సహజమైన హక్కు ఉంటుందని, అందుకే అందరూ చదవాలి… అందరూ సమానంగా బ్రతకాలి… అని అనునిత్యం తపించిన సామాజిక విప్లవ మాతృమూర్తి సావిత్రిబాయి. నాటి, నేటి సమాజంలో సావిత్రిబాయి ప్రాముఖ్యత చాలా గొప్పది. ఆమె తన భర్తకు తోడునీడగా నడవడం మాత్రమే కాక, స్వయంగానే ఆమె సామాజిక విప్లవ మాతృమూర్తి. ఎన్నో అవరోధాలను అధిగమిస్తూ గొప్ప సృజనశీలిగా స్పూర్తిదాయినిగా ఎదిగిన నాయకురాలు, 19వ శతాబ్దంలో ఆమె సాగించిన కృషి ముందు కులం, వర్గం, లింగవివక్ష వంటి శక్తులన్నీ తలవంచక తప్పలేదు. విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ అనేక ఉద్యమాలు నడిపారు. వితంతువులకు వివాహాలు నిర్వహించారు.1831 జనవరి 3న మహారాష్ట్రలోని సతారా జిల్లా నమ్‌గాంవ్‌లో సావిత్రిబాయి జన్మించింది. తొమ్మిదేండ్ల వయస్సున జ్యోతిరావుపూలేను వివాహమాడింది. నిరక్షరాస్యురాలిగా ఉన్న సావిత్రిబాయికి భర్త జ్యోతిరావు పూలే మొదటి గురువు, ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఎన్ఎండి. నజీర్ అహ్మద్, మహిళ ఉపాధ్యాయుని లకు ఘనంగా సత్కరించారు. పిసి కమిటీ చైర్మన్ సిద్దయ్య ,బహుజన్ టైమ్స్ ఎండి దుర్గాప్రసాద్ ,అడ్వకేట్ అర్జున్, మంగయ్య ,దుర్గయ్య ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

About Author