PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సోదర భావంతో మెలగడమే భారతదేశ ఔన్నత్యం

1 min read

– అవాజ్ కమిటీ ఆధ్వర్యంలో శివ స్వాములకు అన్నదాన బిక్ష కార్యక్రమం.
– 300 మంది గురు స్వాములు,శివ స్వాములు హాజరయ్యారు.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు పట్టణంలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయంలో ఆవాజ్ కమిటి ఆధ్వర్యంలో శివ స్వాములకు బిక్ష అన్నదాన కార్యక్రమము మంగళవారము ఏర్పాటు చేశారు.ఈ బిక్ష కార్యక్రమానికి నందికొట్కూరు పట్టణము మరియు పరిసర ప్రాంతాలకు చెందిన దాదాపు 300 మంది శివ స్వాములు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆవాజ్ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అబుబక్కర్ మాట్లాడుతూ కుల, మతాలకు అతీతముగా సేవా భావంతో,ఔన్నత్యము కలిగి ఉండడమే భారతదేశం యొక్క గొప్ప లక్షణమని, అందుకు నిదర్శనమే నందికొట్కూరు పట్టణములో జరిగిన శివ స్వాముల బిక్ష కార్యక్రమమని,ఎప్పుడూ ఎలాంటి పండగ జరిగినా అందరూ కలిసిమెలిసి ఒకరి పండగలకు ఒకరు హాజరై సోదర భావంతో మెలుగుతున్నందునే నందికొట్కూరు పట్టణంలో ఎప్పుడూ ఎలాంటి మత ఘర్షణలు మత గొడవలు జరగలేదని రాబోయే భవిష్యత్తు తరాలు కూడా ఈ విధముగా సోదర భావంతో మెలగాలని ఆకాంక్షించారు. అనంతరము శివ స్వామి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో ఇటువంటి గొప్ప కార్యక్రమము నిర్వహించడము చాలా సంతోషించదగ్గ విషయమని కుల మతాలకు అతీతముగా జీవించడంలో నందికొట్కూరు పట్టణము అన్ని ప్రాంతాలకు ఆదర్శప్రాయం అని తెలిపారు. అనంతరము మండల ఖాజీ మౌలానా సయ్యద్ జలాల్ మాట్లాడుతూ మనమందరము ఒక్కటే,మనందరి సృష్టికర్త ఒక్కడే,మన మత ఆచారాలను ఆచరిస్తూ,ఇతర మతాలను గౌరవించడమే ఇస్లాం యొక్క సందేశమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమములో శివ స్వాములు, అయ్యప్ప గుడి నిర్వాహకులు ఆవాజ్ కమిటీ జిల్లా ఉపాధ్యక్షుడు అబ్దుల్ రహిమాన్,సహాయ కార్యదర్శి మహబూబ్ బాషా,ఆవాజ్ కమిటి పట్టణ అధ్యక్ష,కార్యదర్శులు అబ్దుల్లా, షేక్ అబ్దుల్లా,అల్తాఫ్,మాసూమ్,ఆదమ్, ఖురేష్,మెహబూబ్ భాష,రఫీ,మారుతి నగర్ రఫీ తదితరులు పాల్గొన్నారు.

About Author