PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అర్జెంటీనా పై భార‌త్ గెలుపు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: టోక్యో ఒలంపిక్స్ లో అర్జెంటీనా హాకీ జ‌ట్టు పై భార‌త జ‌ట్టు గెలుపొందింది. పూల్-ఏ నాలుగో మ్యాచ్ లో అర్జంటీనా పై విజ‌యం సాధించింది. డిఫెండింగ్ చాంపియ‌న్ పై భార‌త హాకీ జట్టు మూడో క్వార్టర్స్ లో మొద‌టి గోల్ చేసింది. నాలుగో క్వార్టర్ లో రెండు గోల్స్ చేసింది. ఈ మ్యాచ్ లో 43వ నిమిషంలో భార‌త ఆట‌గాడు కుమార్ వ‌రుణ్ తొలి గోల్ చేయ‌గా.. 58 వ నిమిషంలో ప్రసాద్ వివేక్ సాగ‌ర్ రెండో గోల్ చేశాడు. 59వ నిమిషంలో హ‌ర్మన్ ప్రీత్ సింగ్ గోల్ చేయ‌డంతో అర్జెంటీనా పై భార‌త్ 3-1 తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది.

About Author