స్వల్ప లాభాల్లో సూచీలు !
1 min readపల్లెవెలుగువెబ్ : భారత స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమై తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. ఆద్యంతం ఊగిసలాట ధోరణి ప్రదర్శించాయి. మాక్రో ఎకానమి గణాంకాలు ఆశాజనకంగా లేకపోవడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీసింది. దీంతో కొన్ని షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. సెన్సెక్స్ 85 పాయింట్ల స్వల్ప లాభంతో 61,235 వద్ద, నిఫ్టీ 45 పాయింట్ల లాభంతో 18,257 వద్ద ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ 257 పాయింట్ల నష్టంతో 38,469 వద్ద ట్రేడింగ్ క్లోజ్ అయింది.