భారీ నష్టాల్లో సూచీలు.. బేర్స్ కంట్రోల్ లో మార్కెట్
1 min readపల్లెవెలుగు వెబ్ : అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లలో నెలకొన్న నష్టాలతో భారత స్టాక్ మార్కెట్ సూచీలు కూడ నష్టపోయాయి. ఎంఎన్సి సంస్థల పట్ల చైనా వైఖరి, డెల్టా ప్లస్ వేరియంట్ విజృంభణ కారణంగా అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లలో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో సూచీలు నష్టాల బాట పట్టాయి. భారత్ స్టాక్ సూచీలు కూడ వోలటైల్ గా కదిలాయి. సూచీలు బేర్స్ కంట్రోల్ లోకి వెళ్లాయని చెప్పవచ్చు. సెన్సెక్స్ 300 పాయింట్లు నష్టపోయి.. 55,329 స్థాయి వద్ద ట్రేడింగ్ ముగించింది. నిఫ్టీ 118 పాయింట్లు నష్టపోయి.. 16,450 స్థాయి వద్ద ట్రేడింగ్ ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 526 పాయింట్లు నష్టపోయి.. 35,026 స్థాయి వద్ద ట్రేడింగ్ ముగించింది.