నష్టాల్లో సూచీలు.. బ్యాంక్, ఫార్మా, ఎఫ్ఎంసీజీలో అమ్మకాలు !
1 min readపల్లెవెలుగు వెబ్: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో పయనిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు నెలకొన్న నేపథ్యంలో సూచీలు నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. యూరోపియన్ మార్కెట్లు కూడ ఫ్లాట్ గా ఓపెన్ అయ్యాయి. మరోవైపు బ్యాంకింగ్, ఫార్మా, ఎఫ్ఎంసీజీ రంగాల్లో అమ్మకాలతో సూచీలు నష్టాల్లో పయనిస్తున్నాయి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ స్వల్ప లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. 2:41 నిమిషాల సమయంలో సెన్సెక్స్ 295 పాయింట్ల నష్టంతో 60422 వద్ద, నిఫ్టీ 83 పాయింట్ల నష్టంతో 18025 వద్ద, బ్యాంక్ నిఫ్టీ 409 పాయింట్ల నష్టంతో 38293 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.