లాభాల్లో సూచీలు.. అప్రమత్తమైన ఇన్వెస్టర్లు
1 min readపల్లెవెలుగు వెబ్ : భారత స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ట్రేడింగ్ మొదలుపెట్టాయి. అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు లాభాల బాటలో నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్ కూడ అంతర్జాతీయ మార్కెట్లను అనుసరిస్తోంది. అయితే.. అమెరికా ద్రవ్యోల్బణం రేటు పెరగనుందన్న వార్తల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉన్నారు. ద్రవ్యోల్బణం రేటు పెరుగుతుందన్న వార్తలతో నిన్న ఇంట్రాడే లో మెజారిటీ స్టాక్స్ నష్టపోయాయి. ప్రస్తుతం లాభాల్లో కొనసాగుతున్నప్పటికీ.. ఈరోజు అమెరికా ద్రవ్యోల్బణం వివరాలు వెల్లడికానున్న నేపథ్యంలో అప్రమత్తంగా సూచీలు కదులుతున్నాయి. గత 15 ఏళ్ల అమెరికా చరిత్రలో లేనంతగా ద్రవ్యోల్బణం పెరగనుందన్న వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఇదే కనుక నిజమైతే మార్కెట్లో కొంత వరకు నష్టం వాటిల్లే పరిస్థితి ఉంది. ఉదయం 10 గంటల సమయంలో నిఫ్టీ – 57 పాయింట్ల లాభంతో 15,693 వద్ద ట్రేడ్ అవుతుండగా.. బ్యాంక్ నిఫ్టీ 34 పాయింట్ల లాభంతో 34,797 వద్ద ట్రేడ్ అవుతోంది.