భారీ నష్టాల్లో సూచీలు.. పడిన రూపాయి విలువ
1 min readపల్లెవెలుగు వెబ్: యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు పెంచనున్నట్టు ప్రకటించన నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైనప్పటికీ.. ఇన్వెస్టర్లు మార్కెట్లో అమ్మకాలకు దిగారు. అంతర్జాతీయం మార్కెట్లు మిశ్రమంగా కదులుతున్నాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ తగ్గింది. ప్రస్తుతం 74.08 గా రూపాయి విలువ ఉంది. ఉదయం 11:30 సమయంలో నిఫ్టీ 118 పాయింట్ల నష్టంతో 15,567 వద్ద ట్రేడ్ అవుతుండగా.. బ్యాంక్ నిఫ్టీ 455 పాయింట్లు నష్టపోయి 34,152 వద్ద ట్రేడ్ అవుతోంది.