NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఫ్లాట్ గా ముగిసిన సూచీలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్ గా ముగిశాయి. ఉద‌యం భారీ న‌ష్టాల‌తో ప్రారంభ‌మైన సూచీలు అనంత‌రం స్వ‌ల్ప లాభాల్లోకి చేరాయి. త‌ర్వాత ఫ్లాట్ గా ముగిశాయి. క‌నిష్ఠాల వ‌ద్ద స్టాక్స్ లో కొనుగోళ్లు జోరందుకోవ‌డంతో ఫ్లాట్ గా ముగిశాయి. అంత‌ర్జాతీయంగా ప్ర‌తికూల సంకేతాలు.. వ‌రుస‌గా ఐదు రోజులు లాభాల్లో కొన‌సాగ‌డంతో లాభాల స్వీక‌ర‌ణ జ‌రిగింద‌ని చెప్ప‌వ‌చ్చు. బ‌డ్జెట్, సానుకూల త్రైమాసిక ఫ‌లితాలు సూచీల్లో కనిష్ఠాల వ‌ద్ద కొనుగోళ్ల‌కు దోహ‌దం చేశాయి. సెన్సెక్స్ 12 పాయింట్ల స్వ‌ల్ప లాభంతో 61,223 వ‌ద్ద‌, నిఫ్టీ 2 పాయింట్ల స్వ‌ల్ప లాభంతో 18,255 వ‌ద్ద ముగిశాయి.

                                        

About Author