NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

లాభాల్లో ముగిసిన సూచీలు !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. అంత‌ర్జాతీయంగా స్టాక్ మార్కెట్లలో ప్రతికూల సంకేతాల నేప‌థ్యంలో ఉద‌యం ఫ్లాట్ గా ట్రేడింగ్ ప్రారంభ‌మైంది. రోజంతా అదే ధోర‌ణిలో కొన‌సాగింది. అనంత‌రం చివ‌రి గంట‌లో కీల‌క రంగాల్లో కొనుగోళ్ల మ‌ద్దతుతో ఇంట్రాడే గరిష్ఠాల్ని న‌మోదు చేసింది. దేశీయంగా విద్యుత్ సంక్షోభం రానుంద‌న్న భ‌యాల నేప‌థ్యంలో ఇన్వెస్టర్లు సూచీలు అప్రమ‌త్తంగా క‌దిలాయి. క‌రెంటు కోత‌ల‌కు ఆస్కారం లేద‌ని కేంద్రం ప్రక‌టించ‌డంతో చివ‌రి గంట‌లో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు తెర‌లేపారు. సెన్సెక్స్ 148 పాయింట్ల లాభంతో 60,284 వ‌ద్ద‌, నిఫ్టీ 46 పాయింట్ల లాభంతో 17,991 వ‌ద్ద స్థిర‌ప‌డింది.

About Author