PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వ్యక్తిగత సెల్ ముఖాధారిత హాజరును రద్దు చేయాలి: ఫ్యాప్టో

1 min read

పల్లెవెలుగు వెబ్​: ఉపాధ్యాయులను యాప్ లు నింపే పనినుండి తప్పించి బోధనకు పరిమితం చేయాలని, అదేవిధంగా టీచర్ అటెండెన్స్ యాప్ ను తమ వ్యక్తిగత మొబైల్ నుండి ఆపరేట్ చేయాలని ఆదేశించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు  ఫ్యాప్టో రాష్ట్ర నాయకులు  K. ప్రకాష్ రావు,జి. హృదయ రాజు . ప్రభుత్వ పాఠశాలల బాత్రూం ఫోటోలు, మధ్యాహ్నం భోజనం మెనూ ఉన్న పాత్రల ఫోటోలు మరియు భోజనం చేసే విధ్యార్థుల వివరాలు అప్లోడ్ చేయడానికి ,స్టూడెంట్ అటెండెన్స్  అప్లోడ్ చేయడానికి , పాఠ్యపుస్తకాలను వివరాలను అప్లోడ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక యాప్ లను ప్రవేశ పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికితోడు ఈనెల 16 నుండి టీచర్ అటెండెన్స్ కు సంబంధించి “సిమ్స్ ఏపి” అనే యాప్ ను అందరూ తమ వ్యక్తిగత ఫోన్స్ లో ఉపాధ్యాయులు డౌన్లోడ్ చేసుకొని, ప్రతిరోజు పాఠశాలకు వెళ్ళిన తరువాత ఖచ్చితంగా  9 గంటలకు ఫోటోలు తీసుకుని సంబంధిత యాప్ లో అప్లోడ్ చేయాలని సూచన చేయడం జరిగిందని తెలిపారు.  ఖచ్చితంగా తొమ్మిది గంటలకు ఫోటో అప్లోడ్ కాకపోతే ఆ రోజు సెలవు పెట్టినట్లుగా భావించి పై అధికారుల నుంచి సెలవును మంజూరు చేయించుకోవాలని నిబంధనలలో సూచించడం అన్యాయమన్నారు. ఉపాధ్యాయులందరికీ ఖచ్చితంగా ఆండ్రాయిడ్ ఫోన్లు వుండవని, చాలా ప్రాంతాల్లో నెట్ వర్క్ సౌకర్యం వుండదని తెలిసి కూడా ఉపాధ్యాయున్ని ఒక దోషిగా నిలబెట్టేటువంటి పరిస్థితులు ప్రభుత్వం అమలు  చేసే ఈ కార్యక్రమాలు కనబడుతున్నాయనీ ఈ నిరంకుశ విధానాన్ని ఖండిస్తున్నామన్నారు.  ప్రభుత్వానికి కావలసిన సమాచారాన్ని సాంకేతిక రూపంలో తీసుకోదలిస్తే అందుకు ఒక ఉద్యోగిని నియమించుకోవాలని టీచర్ అటెండెన్స్ కు మాత్రము టీచర్ల మొబైల్ యాప్ కాకుండా నాణ్యమైన బయోమెట్రిక్ యంత్రాలను అందించాలని డిమాండ్ చేశారు.   బుధవారం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కర్నూలు జిల్లా విద్యాశాఖాధికారి డా. వి. రంగారెడ్డి వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో జిల్లా ఫ్యాప్టో సభ్యసంఘల నాయకులు UTF జయరాజు ,   STU గోవిందు , APTF:1938 మరియనందం, APTF:257 రంగన్న.      HMA: ఓంకార్ యాదవ్  DTF రత్నం ఈసేపు APPTA: మధుసూధన్ రెడ్డి & R.సేవా నాయక్ BTA: రమసేశయ్య ,తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏ టీచర్ కూడా యాప్ ను డౌన్లోడ్ చేసుకోవద్దని, ఇప్పటికే చేసినట్లైతే ముఖ ఆధారిత హాజరు వెయ్యద్దని, అటెండెన్స్ రిజిస్టర్ లో ఖచ్చితంగా సమయానికి సంతకం చేయాలని పిలుపునిచ్చారు

About Author