పారిశ్రామికాభివృద్ధి, యుతకు ఉద్యోగ అవకాశాలు ప్రాధాన్యత
1 min read
ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్
వచ్చే మార్చి లోగా 7వేల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు
ప్రతినెలా జాబ్ మేళాలు నిర్వహించాలి
దేశంలో కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేసే 50 పర్యాటక ప్రదేశాలలో కొల్లేరు, పోలవరం ప్రాజెక్ట్ లకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తాం
ఎంపీ కి పూలమొక్కలు అందించిన జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి, జేసి పి.ధాత్రి రెడ్డి
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గాలకు జానంపేట వద్ద పోలవరం ప్రాజెక్ట్ కుడిప్రధాన కాల్వ నుండి గోదావరి జలాలను పైప్ లైన్ల ఏర్పాటుకు ప్రతిపాధించా లన్నారు.జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ(దిశ) సమావేశంలో అధికారులకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆదేశించారు.ఏలూరు జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధిపథంలో నిల్పి, అర్హత కలిగిన ప్రతీ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ప్రాధాన్యతగా చేపట్టాలని ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. స్థానిక కలెక్టరేట్ లోని గోదావరి సమావేశపు హాలులో శనివారం జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అధ్యక్షతన జరిగింది. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటాపద్మశ్రీ, జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ పి . ధాత్రిరెడ్డి, ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, సొంగా రోషన్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ జిల్లాను వ్యవసాయంతోపాటు పారిశ్రామికంగా కూడా అభివృద్ధి దిశగా పయనింపజేయాలన్నారు. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు కావలసిన భూమికి అవసరమైన ల్యాండ్ బ్యాంకు వివరాలు అధికారులు సేకరించారన్నారు. ఏ ప్రాంతంలో ఏ పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలం వంటి విషయాలతో పాటు స్కిల్ సెన్సస్ నిర్వహించి ఏ కుటుంబంలో ఉపాధి అవసరమైన వ్యక్తులు, వారి అర్హతలను తెలుసుకోవడం, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించడం, జాబ్ మేళాలు నిర్వహించి, ఎక్కువమంది యువతకు ఉద్యోగ అవకాశాలు కలిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. 2026, మార్చి లోగా జిల్లాలోని 7వేల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ప్రతీ నెల జాబ్ మేళాలు నిర్వహించాలన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, పరిశ్రమలకు దరఖాస్తు చేసుకునేవారికి సింగిల్ విండో విధానం ద్వారా నిర్దేశించిన సమయంలోగా అనుమట్లు మంజూరు చేయాలన్నారు. జిల్లాలోని పరిశ్రమలు 3 వేళా కోట్లరూపాయలు పైగా టర్న్ ఓవర్ కలిగి ఉన్నాయని, వాటి నుండి కార్పొరేట్ సామజిక బాధ్యత నిధులు కింద 2 శాతం వరకు సదరు పరిశ్రమలు చెల్లించవలసి ఉందన్నారు. వీటితో రైతులకు అవసరమైన వివిధ పనులతోపాటు, గ్రామాలలో ప్రజలకు అవసరమైన ఎన్నో పనులు చేపట్టవచ్చని, ఈ దిశగా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని, ఇందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక అధికారిని నియమించి పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వచ్చే ఆర్ధిక సంవత్సరం జిల్లాలో 9 వేల ఎకరాలలో ఉద్యాన పంటలు సాగుయేలా చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన సభ్యులతో ఏలూరు జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) ని నియమించి, తరువాత సమావేశంలో పూర్తి స్థాయి సభ్యులతో సమావేశం నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ అధికారులను ఆదేశించారు. 109 కోట్ల రూపాయలతో ప్రతిపాదించిన ఉంగుటూరు-కైకలూరు రోడ్డు నిర్మాణం పనులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, టి. నర్సాపురం- చింతలపూడి, టి..నర్సాపురం- జంగారెడ్డిగూడెం రోడ్ల నిర్మాణ పనులను వెంటనే చేపట్టి పూర్తిచేయాలన్నారు. జిల్లాలో మంజూరైన రోడ్ల నిర్మాణ పనులను వెంటనే పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామ, మండలాలలో చేపట్టే అభివృద్ధి పనుల వివరాలను స్థానిక ఎమ్మెల్యే లకు తెలియజేసి, వారి సూచనలను కూడా పరిగణనలోనికి తీసుకోవాలని ఎంపీ అధికారులను ఆదేశించారు.దేశంలో 50 ప్రాంతాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చెంసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని, వీటిలో మన జిల్లాలోని కొల్లేరు, పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్ధేందుకు అవసరమైన ప్రతిపాదనలను సమర్పించాలని ఎంపీ అధికారులను ఆదేశించారు. జిల్లాలో అభివృద్ధి పరుగులు తీసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ విజ్ఞప్తి చేసారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ మాట్లాడుతూ పొలం పిలుస్తోంది, పొలం బడి కార్యక్రమాలను రైతులు సద్వినియోగం చేసుకునేలా నిర్వహించాలన్నారు. భీమడోలు మండలం మల్లవరం, చెట్టున్నపాడు గ్రామాలలో త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరాగా, ఈనెల 25వ తేదీ మంగళవారం నుండి ఆగడాలలంక ఛానల్ నుండి త్రాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేస్తామని ఇరిగేషన్ ఎస్ఈ నాగార్జున తెలియజేసారు. జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని, దీనిలో భాగంగా ఇప్పటికే 1830 కోట్ల రూపాయల విలువైన 4302 ఎకరాల ప్రభుత్వ భూమిని ల్యాండ్ బ్యాంకు ద్వారా గుర్తించామన్నారు. పారిశ్రామిక జోనల్ ప్లాన్ ను రూపొందిస్తామన్నారు. జిల్లాలో ఏప్రిల్ 10 వ తేదీన జాబ్ మేళా నిర్వహించి వెయ్యిమందికి ఉపాధి కల్పించే దిశగా ప్రణాళిక రూపొందిస్తామన్నారు. త్రాగునీటి ఓవర్ హెడ్ ట్యాంక్ లు మరమత్తులు కారణంగా ట్యాంకులను శుభ్రం చేయడంలేదని, ఓవర్ హెడ్ ట్యాంకులను మెట్లు వంటి వాటికి మరమ్మత్తులు చేపట్టి, ట్యాంకులను శుభ్రం చేయాలన్నారు. 2019 కి ముందు తమ ప్రభుత్వ హయాంలో గ్రామ సమాఖ్య భవనాల నిర్మాణాలను చేపట్టామని, కానీ వాటిని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో నిర్మాణ పనులు సగంలోనే నిలిచిపోయాయన్నారు. వాటిని పూర్తి చేయాలనీ విజ్ఞప్తి చేశారు. విజ్జేశ్వరం నుంచి గోదావరి నీరు పైప్ లైన్ల ద్వారా సరఫరా చేయాలన్న ప్రతిపాధనలకు ప్రత్యమ్నాయంగా ఏలూరు, దెందులూరు నియోజకవర్గాలకు జానంపేట వద్ద పోలవరం ప్రాజెక్ట్ కుడిప్రధాన కాల్వ నుండి గోదావరి జలాలను పైప్ లైన్ల ఏర్పాటుకు ప్రతిపాధించాలని సూచించారు.చింతలపూడి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ మాట్లాడుతూ చింతలపూడి నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలనీ కోరారు. చింతలపూడి నియోజకవర్గంలో పరిశ్రమలను మంజూరు చేసి నియోజక అభివృద్ధి చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి . ధాత్రిరెడ్డి, జిల్లా పరిషత్ సీఈఓ కె. భీమేశ్వరరావు, డిఆర్డిఏ పీడీ ఆర్. విజయరాజు,ఇరిగేషన్, ఆర్ డబ్ల్యూ ఎస్ సూపరింటెండింగ్ ఇంజినీర్లు నాగార్జునరావు, త్రినాధ్ బాబు, వ్యవసాశాఖాధికారి హబీబ్ భాష, ఉద్యానవన శాఖ డిడి రామ్మోహన్, డిఎంహెచ్ ఓ డా. మాలిని, డిఈఓ వెంకటలక్ష్మమ్మ, మైక్రో ఇరిగేషన్ పీడీ రవికుమార్, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శ్రీలక్ష్మి, ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్ ఎ.భానుప్రతాప్, ప్రభృతులు పాల్గొన్నారు.