PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విశ్వకర్మపథకంలో ఇండస్ట్రియల్ టూర్ చేర్చాలి..

1 min read

– విశ్వకర్మజయంతి జిఓలో విశ్వకర్మమహోత్సవంగామార్చాలి..

– విశ్వబ్రాహ్మణధర్మపీఠం ప్రధానసంచాలకులు శివశ్రీ

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా : స్వాతంత్ర్య అనంతరం విశ్వకర్మ పేరుతో జాతీయ స్థాయిలో సాంప్రదాయ హస్త కళాకారుల కోసం కేంద్ర ప్రభుత్వం పిఎం విశ్వకర్మకౌసల్ యోజన పథకాన్ని ప్రకటించడం, రాష్రప్రభుత్వం విశ్వకర్మమహోత్సవాన్ని రాష్ట్రస్థాయి పండుగగా ప్రకటిస్తూ జిఓ జారిచేయడంపట్ల ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణధర్మపీఠం ప్రధానసంచాలకులు అప్పలభక్తులశివకేశవరావు (శివశ్రీ) ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అయితే రాష్ట్రప్రభుత్వజిఓలో సవరణతోపాటు కేంద్రప్రభుత్వం ప్రకటించిన ప్రధానమంత్రి విశ్వకర్మ కౌశల్ యోజన పధకంలో ను పలుమార్పులను ఆయనసూచించారు. విశ్వసృష్టికర్త ఆద్యంతములు లేనిపరమాత్మ అని ఆయనకు జయంతులుఉండవుకనుక జిఓనె24ను సవరించి విశ్వకర్మజయంతికి బదులుగా ‘విశ్వకర్మమహోత్సవము’గా ప్రకటించవలశిందిగా రాష్ట్రప్రభుత్వానికి విఙ్ఞప్తిచేశారు.విశ్వకర్మ సాంప్రదాయ ప్రధాన ఉత్పత్తులు ఐదు నైపుణ్యము సృజనాత్మకత కూడినవని మానవ మనుగడ కోసం విశ్వకర్మ పరమాత్మ చేసృష్టింపడిన ఈ ఐదు హస్తకళలు అయో శిల్పము (బ్లాక్ స్మిత్) దారు శిల్పము (కార్పెంటరి) తామ్ర శిల్పం (బ్రాసరి) శిలా శిల్పము( స్టోన్ కార్వింగ్) స్వర్ణ శిల్పము (గోల్డ్స్మిత్) ఈ పంచధాతువులతో సృష్టించుట విశ్వకర్మ సాంప్రదాయ విశ్వబ్రాహ్మణుల వంశపారంపర్య కర్తవ్యం గా ఆయనతెలిపారు. మనుబ్రహ్మ, మయబ్రహ్మ,త్వష్ట బ్రహ్మ ,శిల్పి బ్రహ్మ, విశ్వజ్ఞ బ్రహ్మల పరంపరగా వంశపారంపర్యంగా ఈ ఐదువృత్తులపై ఆధారపడి సమాజ కళ్యాణానికి అంకితమై జీవనాన్ని సాగిస్తున్న వారే విశ్వబ్రాహ్మణులని.వీరు నిర్మించిన అద్వితీయమైన నిర్మాణాలు, అద్భుతమైన కట్టడాలు  అపురూపమైన శిల్ప సంపద, భారతదేశనికి ఖ్యాతిని విదేశీ మారకద్రవ్యాన్ని సైతం ఆర్జించి పెడుతున్నాయని ఆయనవివరించారు.అయితే చరిత్రలో అనాదిగా ఈ జాతిపై జరిగిన కుట్రలు కుతంత్రాల వల్ల ఆధునికమైన ఉత్పత్తుల వల్ల ఈ ఉత్పత్తులకు ఆదరణ కోల్పోయి కేవలం వృత్తిపనివారిగా చాలీచాలని ఆదాయంతో ఆర్థిక సామాజిక విద్యాఉద్యోగ రాజకీయ రంగాలలో అభ్యున్నతిని సాధించలేకపోయారని ఆవేదనవ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వం గౌరవ మాన్యశ్రీ ప్రధాని నరేంద్ర మోడీ  నేతృత్వంలో ఈ ప్రధాన వృత్తుల తో పాటు ఈ వృత్తులపై ఆధారపడిన 18రకాలఉపఉత్పత్తిదారులకు సైతం ప్రయోజనం చేకూరేలా పీఎం విశ్వకర్మ యోజన పథకానికి రూపకల్పన చేయడం మాకు లభించిన గౌరవంగా ప్రోత్సహంగా భావిస్తున్నామనిఅయితే ఈ పథకంలో కొన్ని సవరణలు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.ఈ పథకంలో భాగంగా ప్రభుత్వంఅందించే శిక్షణ ఆర్థిక సహకారం మార్కెటింగ్ సదుపాయాలతో పాటు ఏ వస్తువునైనా ఉత్పత్తి చేయగల నైపుణ్యము సామర్ధ్యము కలిగిన ఉత్పత్తిదారులను పారిశ్రామిక వేత్తలుగా మార్చేందుకుగాను నేడు మార్కెట్లో ఆదరణ ఉన్న డిమాండ్ ఉన్న ఆధునిక వస్తు ఉత్పత్తుల పరిశ్రమలను సందర్శించే అవగాహన కలిగించే విధంగా ‘ఇండస్ట్రియల్ టూర్’  ఏర్పాటు చేయాల్సిన అవసరము ఆవశ్యకత ఉన్నదని తెలిపారుఆసక్తి కలిగిన యువత ఈ పథకంలో భాగంగా పరిశ్రమలను నెలకొల్పుటకు ముందుకు వచ్చే సందర్భాలలో మైక్రోస్థాయి నుండి చిన్నతరహా పరిశ్రమల స్థాపించుకునేందుకు కోటి రూపాయల వరకు ఇదే నిబంధనలతో వర్తింప చేసే విధంగా విశ్వకర్మ పథకంలో వెసులుబాటు కల్పించాలని ఆయనకోరారు.ప్రధానంగా ఆధునిక ఉత్పత్తి రంగాల్లో ఇండస్ట్రియల్ టూర్ తో పాటు ఆయా పరిశ్రమల అవగాహన కొరకు స్వల్పకాలిక శిక్షణ పరిశ్రమ స్థాపన అనంతరం మార్కెటింగ్ సదుపాయం కొరకు ప్రత్యేక యంత్రాంగాన్ని (నోడల్ ఏజెన్సీని) ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విఙ్ఞప్తిచేశారు. తరతరాలుగా ఈ సాంప్రదాయ వృత్తుల్లో ఉన్న వారు వారి అభిరుచికి అవగాహనకు తగిన విధంగా ఇతర పరిశ్రమలు  స్థాపించుకునేందుకు వెసులుబాటు కల్పించాలనిఈ విధమైన ప్రోత్సాహాన్ని అందించినప్పుడు మాత్రమే జన్మతః సృజనాత్మకత ఏ వస్తునైనా ఉత్పత్తి చేయగల సామర్థ్యం కలిగిన విశ్వకర్మ సాంప్రదాయ ఉత్పత్తిదారులు పారిశ్రామికవేత్తలుగా ఎదగగలుగుతారని ఆయనపేర్కొన్నారు.అప్పుడు మాత్రమే పీఎం విశ్వకర్మ యోజన పథకం యొక్క లక్ష్యం నెరవేరుతుందని ఆయనప్రభుత్వానికి సూచించారు.

About Author