సరైన నాయకుడు ఉంటే పరిశ్రమలు తరలివస్తాయి.. టిడిపి ఇంచార్జి టి.జి భరత్
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: సరైన నాయకుడు ఉంటేనే పరిశ్రమలు వచ్చేందుకు అవకాశం ఉంటుందని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. నగరంలోని పుల్లయ్య ఇంజినీరింగ్ కళాశాలలో ఓటు ప్రాముఖ్యత.. విద్యార్థుల భవిష్యత్తు అనే అంశంపై ఆయన విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో తనకు ఓటు వేస్తే కర్నూలు ప్రజలకు ఎలా మేలు జరుగుతుందో టి.జి భరత్ వివరించారు. ఒక పారిశ్రామికవేత్తగా కర్నూలుకు కంపెనీలు తెస్తానని, కర్నూల్‌ను విజన్‌తో ఎంతో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఎదుర్కొంటున్న నిరుద్యోగం, వైద్యం, ట్రాఫిక్ సమస్యలకు చక్కటి పరిష్కారం చూపిస్తానన్నారు. అర్హులకు సంక్షేమం, అందరికీ అభివృద్ధి ఫలాలు అందించేందుకు ప్రణాళిక ప్రకారం కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. కర్నూల్లో తాను గెలిచి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అందరికీ మేలు జరుగుతుందన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ ప్రభుత్వంలో అమలుచేసిన విధానాలను శుద్ధి చేస్తామన్నారు. పేదలకు ఎంతో ఉపయోగకరమైన అన్నా క్యాంటిన్లను మళ్లీ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు సోమిశెట్టి నవీన్, అబ్బాస్, నంద్యాల నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు.