ఇన్ఫాన్ జీసస్ (అభయగిరి ) చిల్డ్రన్స్ హోమ్ తనిఖీ
1 min read
కర్నూలు , న్యూస్ నేడు: జాతీయ, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు మరియు జిల్లా ప్రధాన న్యాయ మూర్తి శ్రీ జి. కబర్థి సూచనల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీ బి. లీలా వెంకట శేషాద్రి , గురువారం నాడు కర్నూలు మిలటరీ కాలనీ నందుగల ఇన్ఫాన్ జీసస్ చిల్డ్రన్ హోమ్ ను తనిఖీ చేయడం జరిగింది. ఆశ్రమంలోనీ నిరాశ్రయులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆశ్రమంలోని రికార్డులును అలాగే పరిశుభ్రతను పరిశీలించారు. అలాగే వారికీ అందుతున్న ఆహార, వైద్య సదుపాయల గురించి అడిగి తెలుసుకున్నారు. వారికీ ఏమైనా సమస్యలు వస్తే 15100టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేస్తే వెంటనే న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు. తనిఖీ, వైద్య సదుపాయాలు, రికార్డులు,