శిశుమరణాలను సమర్ధవంతంగా నివారించాలి
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: బుధవారం రామాళ్లకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని వెల్దుర్తి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ లో జరుగుచున్న సంచార చికిత్స కార్యక్రమాన్ని జిల్లా నోడల్ అధికారి డాక్టర్. రఘు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం గర్భిణీలను ఉద్దేశించి మాట్లాడుతూ మాతా శిశు సంరక్షణ కార్డు గురించి అవగాహన కల్పించిన్నారు,మాత శిశుమరణాలను సమర్థవంతంగా నివారించాలంటే గర్భిణిల వివరాలు ,వారికున్న ఆరోగ్య ఇబ్బందులు,ప్రస్తుతం అందిస్తున్న వైద్యం,మున్ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు తదితర వివరాలను మాత శిశు సంరక్షణ కార్డు నమోదుచేస్తారు.ఒక మహిళా మొదటి నెల గర్భిణీ అయిన నుంచి 9 వ నెల వరకు ప్రసవం అనంతరం తీసుకోవలసిన జాగ్రత్తలు,అందించిన వైద్యం తదితర వివరాలన్నీ అందులో నమోదు చేస్తారు. మాత శిశు సంరక్షణ కార్డు మాత శిశుమరణాలను పకడ్బందీగా నియంత్రించడంలో ఎంసీపి కార్డు కు ప్రాధాన్యం ఉంటుంది,మొదటి నెల గర్భం దాల్చినప్పటి నుంచి కాన్పు అయ్యే వరకు ఆమె ఆరోగ్య స్థితిగతులు, అందించిన, వైద్యం,అందించాల్సిన వైద్యం,వ్యాధినిరోధకటీకాల వివరాలు,ప్రసవం అయ్యాక శిశువు ఆరోగ్యంగా ఎదగడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు తదితర వివరాలు ఆరోగ్య కార్యక్రమాలన్నీ ఈ కార్డులో నమోదు చేస్తారు,దీన్ని పరిశీలించి వైద్యులు ప్రతి నెల వారికి చికిత్సలు చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్. భువనతేజ , సామాజిక ఆరోగ్య అధికారి మౌనిక, ఆరోగ్య కార్యకర్త బుచ్చమ్మ, ఆశా కార్యకర్తలు మరియు ప్రాజెక్షనిస్ట్ ఖలీల్ పాల్గొన్నారు.