పెంచిన ఎరువుల ధరలు తగ్గించాలి
1 min readపల్లెవెలుగు వెబ్, ఆస్పరి: రైతులకు శాపంగా మారిన ఎరువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు సీపీఐ మండల కార్యదర్శి విరుపాక్షి. శుక్రవారం పెంచిన ధరలు తగ్గించాలని ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ రమణ బాబుకు వినతిపత్రం అందజేశారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ నిత్యవసర ధరలు పెంచిన కేంద్ర ప్రభుత్వం.. రైతులపై భారం మోపేలా రసాయన ఎరువుల ధరలు పెంచిందని విరుపాక్షి ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగు ఖర్చులు భరించలేక చాలా మంది రైతులు వ్యవసాయ రంగానికి దూరం అవుతున్నారని, మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపి కాంప్లెక్స్ ఎరువుల ధరలను 58 శాతం పెంచినట్టు ప్రకటించి అందుకు సంబంధించిన ఉత్తర్వులు అమలు చేయడంతో రైతుకు ఒక ఎకరాకు రూ.7 వేల నుండి 10వేల వరకు సాగు ఖర్చులు పెరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి కృష్ణమూర్తి, రాజశేఖర్ ,చంద్ర ,విజయ్ తదితరులు పాల్గొన్నారు.