PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పెంచిన పెట్రోల్​, డీజిల్​ ధరలు తగ్గించాలి

1 min read

పల్లెవెలుగు వెబ్​, ఆస్పరి: కరోన విపత్కర సమయంలో పేదలను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఐ పట్టణ కార్యదర్శి కృష్ణమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన పెట్రోల్​, డీజిల్​, నిత్యావసర ధరలు తగ్గించాలని డిమాండ్​చేస్తూ శుక్రవారం సీపీఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఒకే నెలలో 17 సార్లు పెట్రోల్​,డీజిల్​ ధరలు పెంచిందని, దీంతో నిత్యావసర ధరలు ఆకాశాన్నంటాయన్నారు. లీటరు పెట్రోల్​ ధర వందకు పైగా ఉంటే…కందిపప్పు, నూనె, కూరగాయల రేట్లు విపరీతంగాపెరిగి..సామాన్యుల నడ్డి విరిచిందన్నారు. కరోన కష్టకాలంలో ఉపాధి కల్పించి.. ఆర్థికంగా చేదోడుగా నిలవాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్​ చేశారు. ఈ కార్యక్రమంలో హమాలీ సంఘం అధ్యక్షులు జైపాల్, రంగన్న వీరేశ్ , రామాంజనేయ, వీరేశ్, శివ, శంకర్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

About Author