ద్రవ్యోల్బణం @ 7.8
1 min readపల్లెవెలుగువెబ్ : ఏప్రిల్‌లో ద్రవ్యోల్బణం 8 సంవత్సరాల గరిష్ట స్థాయి 7.8 శాతానికి చేరుకుందని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వెల్లడించింది. భారతీయ వినియోగదారులు ఎదుర్కొంటున్న ద్రవ్యోల్బణం మార్చిలో 6.95 శాతం నుంచి ఏప్రిల్‌లో దాదాపు ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయి 7.8 శాతానికి పెరిగింది. గ్రామీణ ద్రవ్యోల్బణం 8.4శాతం, దేశంలోని పట్టణ ప్రాంతాలు 7.1 శాతం ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటున్నాయని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ గురువారం విడుదల చేసిన గణాంకాలు పేర్కొన్నాయి. వినియోగదారుల ఆహార ధరల సూచిక మార్చిలో 7.7శాతం నుంచి 8.4 శాతానికి పెరిగింది.