భారత్ లోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం !
1 min readపల్లెవెలుగువెబ్ : భారత దేశానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం భారీగా పెరిగిందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. 2003-04 ఆర్థిక సంవత్సరంలో 4.3 బిలియన్ డాలర్లు ఎఫ్‌డీఐలు రాగా, 2021-22 ఆర్థిక సంవత్సరంలో 83.57 బిలియన్ డాలర్లు వచ్చినట్లు తెలిపింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం , కోవిడ్-19 మహమ్మారి ప్రభావం ఉన్నప్పటికీ 2021-22 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఎఫ్‌డీఐలు అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో వచ్చినవాటి కన్నా 1.60 బిలియన్ డాలర్లు ఎక్కువ అని వివరించింది.