అసెంబ్లీ సమావేశాలు కుదించే యోచనలో ప్రభుత్వం
1 min read
పల్లెవెలుగు వెబ్: అసెంబ్లీ సమావేశాలను కుదించే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. వరద ప్రభావిత ప్రాంతాల్లో సంబంధిత ఎమ్మెల్యేలు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నందునా.. సభ వాయిదా పడే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లో మొత్తం 23 బిల్లులను ప్రవేశపెట్టాలని భావిస్తున్న ప్రభుత్వం.. ఇప్పటికే 12 బిల్లులను ప్రవేశపెట్టింది. నేడు వీటి ఆమోదం లాంఛనమే. మిగిలిన 11 బిల్లులను నేడు సభ ముందుకు రానున్నాయి.
అనంతరం వీటిని ఆమోదించి శాసనమండలి ఆమోదం కోసం పంపాల్సి ఉంటుంది. అక్కడ కూడా వీటికి ఆమోద ముద్ర పడితే నేటితోనే అసెంబ్లీ సమావేశాలను ముగిస్తారు. ఒకవేళా బిల్లుల ఆమోదంలో ఏదైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే మరో రోజు అంటే రేపు కూడా సభ కొనసాగించే అవకాశం ఉంది. అలాగే వచ్చే నెలలో 5 రోజులపాటు అసెంబ్లీని నిర్వహించాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.