PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కొత్త సబ్సిడరీని ప్రారంభించిన ఇన్ఫోవ్యూ సిస్టమ్స్ ఇంక్

1 min read

– 30 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న కంపెనీ, లెగసీ
ఆధునీకరణ, ఇంటిగ్రేషన్, క్లౌడ్ సేవల్లో ప్రత్యేకతలు
పల్లెవెలుగు, వెబ్ హైదరాబాద్​ : ఇన్నవేటివ్ ఇంటిగ్రేషన్ ఉత్పత్తులు, సేవలు అందించే అమెరికాకు చెందిన ఇన్ఫోవ్యూ సిస్టమ్స్ ఇంక్ తన ఇండియా డెవలప్ మెంట్ సెంటర్ (ఐడీసీ)ని హైదరాబాద్ నగరంలో ఈరోజు ప్రారంభించింది. హైసియా ప్రెసిడెంట్ & డెలివరీ హెడ్ ఇన్ఫోసిస్, మనీషా సబూ ఈ ఐడీసీని ప్రారంభించారు. దేశంలోనే వ్యాపారం, టెక్నాలజీలకు ప్రధాన కేంద్రాల్లో ఒకటైన హైదరాబాద్ నగరంలో తన కొత్త డెవలప్ మెంట్, సర్వీసెస్ సెంటర్ ప్రారంభంతో ఇన్ఫోవ్యూ సిస్టమ్స్ ఇంక్ సంస్థ భారతదేశంలో తన రెండో కంపెనీని విస్తరించింది. ఈ సంస్థ ఆగ్నేయాసియా, భారతీయ సంస్థలకు సరికొత్త టెక్నాలజీలను గుర్తించడం, అమలు చేయడం, నిర్వహించడంలో సహాయపడుతుంది. అదే సమయంలో మెరుగైన ఉత్పత్తులు, సేవలను సృష్టించడం, ప్రోత్సహించడం, మద్దతు ఇవ్వడంలో ఐటీ కంపెనీలకు సహాయపడుతుంది. ఇన్ఫోవ్యూ సిస్టమ్స్ కొత్త కేంద్రం ప్రారంభం సందర్భంగా సంస్థ సీటీవో సత్య శేఖర్ దాస్ మండల్ మాట్లాడుతూ, “భారతదేశంలో ఇన్ఫోవ్యూ సిస్టమ్స్ డెవలప్ మెంట్, సర్వీసెస్ సెంటర్ ప్రపంచంలోని రెండు అతిపెద్ద సైట్లలో ఒకటి. ఇది ఐటీ సేవల్లో పోటీ పడేందుకు ఒక సానుకూలత పొందడానికి ముఖ్యమైన సాంకేతిక పురోగతిని అందిస్తుంది. కొత్త డెవలప్ మెంట్, సర్వీసెస్ సెంటర్ మొత్తం టర్నోవర్ లో 30% కంటే ఎక్కువ ఆదాయంతో 5 రెట్ల మంది ఉద్యోగులను కలిగి ఉంటుంది. భారతదేశం సాంకేతిక పురోభివృద్ధికి కేంద్రంగా మాత్రమే కాకుండా, ఇన్ఫోవ్యూ సిస్టమ్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కు అభివృద్ధి చెందుతున్న మార్కెట్ కూడా. మాకు 80 మందికి పైగా భారతీయ క్లయింట్లు ఉన్నారు. మా క్లయింట్లకు అందుబాటులో అత్యుత్తమ సేవలను అందించడానికి మ్యూల్ సాఫ్ట్, కాన్ ఫ్లుయెంట్, ఐబీఎం, ఇతర ప్రముఖ టెక్నాలజీ ప్లాట్ ఫాంలతో కలిసి పనిచేశాం’’ అని వివరించారు.”భారతదేశం ఇన్ఫోవ్యూ సిస్టమ్స్ వ్యూహాత్మక కేంద్రం. ఇక్కడ మంచి అర్హతలున్న సిబ్బందితో అంతర్జాతీయ సాంకేతిక అభివృద్ధి సాధ్యమవుతుంది. హైదరాబాద్ లో మా కొత్త డెవలప్ మెంట్ సెంటర్ పెరుగుదల క్లౌడ్ ఇన్నోవేషన్, ఇంజినీరింగ్, రీసెర్చ్ దిశగా మా అంతర్జాతీయ ప్రయత్నాలను మరింత విస్తరించడానికి మమ్మల్ని ప్రోత్సహిస్తుంది. గత పదేళ్లుగా మేము దేశంలోని అపారమైన టాలెంట్ పూల్ ను పూర్తిగా ఉపయోగించుకున్నాము” అని ఇన్ఫోవ్యూ సిస్టమ్స్ ఇంక్ ప్రెసిడెంట్ మైక్ ఓ’మియారా అన్నారు. 2020లో స్థాపించిన ఇన్ఫోవ్యూ సిస్టమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఇన్ఫోవ్యూ సిస్టమ్స్ ఇంక్ మొదటి సబ్సిడరీ. కంపెనీ నైపుణ్యాలు, సేవలు, కస్టమ్ ఉత్పత్తుల ప్రత్యేకమైన కలయికతో.. భౌగోళికంగా వైవిధ్యమైన ప్రొఫెషనల్ సర్వీసెస్ టీంగా అభివృద్ధి చెందింది. ఇవన్నీ కస్టమర్లకు కావల్సిన వ్యాపార ఫలితాలు, దీర్ఘకాలిక సంరక్షణ, ఉద్యోగుల పెరుగుదలకు ప్రాధాన్యం ఇస్తాయి. ఇన్ఫోవ్యూ సిస్టమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రాసెస్ లు, నాలెడ్జ్ రిటైల్, హెల్త్ కేర్, డిస్ట్రిబ్యూషన్, మాన్యుఫాక్చరింగ్, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఐటీ, వేస్ట్ మేనేజ్ మెంట్, ప్రజా, ప్రభుత్వ సర్వీసులతో సహా అన్ని రకాల వర్టికల్స్ తో కూడిన విస్తృత పోర్ట్ ఫోలియోను కలిగి ఉంది. సిస్టమ్స్ ఇంటిగ్రేషన్స్, క్వాలిటీ టెస్టింగ్, ఈ-కామర్స్, మొబైల్, డేటా ఎనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, ఐఓటీ లాంటి డిజిటల్ టెక్నాలజీలకు ఇన్ఫోవ్యూ సిస్టమ్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సపోర్ట్ చేస్తుంది.

About Author