పంచాయతీ పరిధిలో మౌలిక ఏర్పాట్లు వేగవంతం..
1 min read– శుభ్రతపై సిబ్బందితో గ్రామ ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం..
– కార్యదర్శి వై సుమలత
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా : ఏలూరు మండలం మాదేపల్లి సర్పంచ్ గ్రామ ప్రజలు నాయకులతో కలిసి గ్రామ అభివృద్ధికి సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తున్నానని నిధుల కొరత కారణంగా సత్వరమే సమస్యలు పరిష్కరించలేక పోతున్నానని మాదే పల్లి గ్రామ కార్యదర్శి వై సుమలత అన్నారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాకాలం సందర్భంగా గ్రామ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అనారోగ్యాల బారిన పడకుండా గ్రామంలో ప్రతిరోజు డ్రైనేజీలను. ఓ హెచ్ ఆర్ ఎస్ ట్యాంకుల శుభ్రత ప్రతి వీధిలోను బీజింగ్ జల్లించడం ఎక్కడ కూడా మురుగునీరు నిలువ లేకుండా సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నామన్నారు. చెత్తాచెదారం బహిరంగ ప్రదేశాలలో నిల్వలు లేకుండా చర్యలు చేపడుతున్నామని డంపింగ్ రిక్షలకు, వాహనాలకు అందజేయాలని గృహిణులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. గ్రామ ప్రజల అవసరాలకు అనుగుణంగా పరిశుభ్రమైన మంచినీటిని సరఫరా చేస్తున్నామన్నారు. ప్రస్తుత సంవత్సరం 90 శాతం పన్నులు వసూలు చేయడం జరిగిందని జనరల్ ఫండ్స్ తోనే సిబ్బంది జీతభత్యాలు అందిస్తు మన్నారు. గ్రామంలో చిన్న చితక పనుల సమస్యలు త్వరగతిన పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు.గత రెండు నెలలుగా నిధుల కొరతతో పంచాయతీ లో చిన్నచిన్న అవసరాలకు సైతం నిధులు అందుబాటులో లేకపోవడం చాలా భారంగా ఉందని ఆమె అన్నారు. గ్రామంలో కొన్ని రోడ్లలోని ఇరుపక్కల డ్రైనేజీలు ఏర్పాటు చేయడం సిసి రోడ్లు ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకత ఉందని నిధులు మంజూరు అయితే వెంటనే చర్యలు చేపడతామని ఆమె తెలిపారు.