10 వ తరగతి పబ్లిక్ పరీక్ష కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలి
1 min read
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 3వ తేదీ నుండి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగుతుండగా, పత్తికొండ పట్టణం నందు నిబంధనలకు విరుద్ధంగా, పరీక్ష కేంద్రాల్లో ఎటువంటి సదుపాయాలు లేవని,తక్షణమే పరీక్షా కేంద్రాల్లో కనీస వసతులు కల్పించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు అల్తాఫ్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2022 సంవత్సరంలో పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసినప్పటికీ అక్కడ కనీస మౌలిక వసతులు, నీరు పరీక్ష గదలలో ఫ్యాన్లు లేకపోవడం చాలా బాధాకరమైన విషయమని ఆయన వాపోయారు, ఇప్పుడున్న సమయంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో విద్యార్థులు ఉష్ణోగ్రతకు గురై ఇబ్బందులు పడే అవకాశం ఉంది, కావున నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పరీక్ష కేంద్రాలపై చర్యలు తీసుకోవాలని మండల విద్యాశాఖ అధికారి మస్తాన్వలికి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఎంఈఓ మస్తాన్వలి మాట్లాడుతూ, ప్రభుత్వా నిబంధనలకు వ్యతిరేకంగా, మౌలిక సదుపాయాలు లేని పరీక్ష కేంద్రాలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి నజీర్, పట్టణ కార్యదర్శి అహ్మద్, నరేంద్ర, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.