PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గడియారం హాస్పిటల్ లో మౌలిక వసతులు కల్పించాలి : సీపీఎం

1 min read

పల్లెవెలుగు వెబ్​: కర్నూలు నగరం పాతబస్తీ నందుగల గడియారం హాస్పిటల్ లో మౌలిక వసతులు కల్పించడంతోపాటు ,ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని సిపిఎం నగర కార్యదర్శి ఎం రాజశేఖర్, కార్యదర్శివర్గ సభ్యులు షేక్ ముహమ్మద్ షరీఫ్, D అబ్దుల్ దేశాయ్ డిమాండ్ చేశారు. మంగళవారం గడియారం హాస్పిటల్ పర్యటన చేశారు. ఈ సందర్భంగావారు  అక్కడ ఉన్న సిబ్బంది మాట్లాడారు. అక్కడ ఉన్న పేషెంట్లు అటెండర్ లతో విచారించారు.  రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గడియారం ఆస్పత్రిలో మౌలి వసతులు కల్పించడంతోపాటు ఖాళీగా ఉన్న మూడు ఏఎన్​ఎం, మూడు స్టాఫ్​ నర్స్​ పోస్టులను భర్తీ చేసి పేదలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.  ఈ కార్యక్రమంలో గౌస్ భాష, ఇస్మాయిల్ , ఖాదర్ , ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.

About Author