PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సిద్దేశ్వరం గిరిజనులకు మౌలిక సదుపాయాలు కల్పించాలి

1 min read

నేషనల్ హైవే పనులలో స్థానిక డ్రైవర్స్ కి ఉపాధి కల్పించాలి.

డి పట్టా భూములకు నష్టపరిహారం చెల్లించాలి.

జాయింట్ కలెక్టర్ కు సిపిఐ వినతి. 

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు:  కర్నూలు నుండి గుంటూరు వరకు జరిగే నేషనల్ హైవే పనులలో స్థానిక ఆపరేటర్స్ డ్రైవర్స్ నిరుద్యోగులకు మొదటి ప్రాధాన్యత ఉపాధి అవకాశాలు కల్పించాలని, భూములు కోల్పోయిన డి పట్టాదారులకు నష్టపరిహారం చెల్లించాలని జూపాడుబంగ్లా మండలం సిద్దేశ్వరం గ్రామ గిరిజనులకు విద్యుత్, పక్కా గృహాలు  మౌలిక సదుపాయాలు కల్పించాలని,రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులను అందుబాటులో ఉంచాలని కోరుతూ నంద్యాల జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి కి సీపీఐ జిల్లా నాయకులు రఘురాంమూర్తి,రమేష్ బాబులు వినతిపత్రం అందించారు. మంగళవారం నందికొట్కూరు తహసిల్దార్ కార్యాలయానికి వచ్చిన జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి కి వినతిపత్రం అందించి  మాట్లాడారు  నియోజకవర్గంలో వందలాదిమంది నిరుద్యోగులు ఇతర ప్రాంతాలకు డ్రైవర్లుగా వలసలు వెళ్లి జీవిస్తున్నారని తక్షణమే స్థానికంగా చేసే నేషనల్ హైవే పనులలో మొదటి ప్రాధాన్యతగా ఆపరేటర్స్ డ్రైవర్స్ కి అవకాశాలు కల్పించి కనీస వేతనాలు ఇవ్వాలని కంపెనీలు స్థానికులను విస్మరిస్తే తగదని వారన్నారు. విలువైన భూములు త్యాగం చేస్తున్న ఈ ప్రాంత వాసులను ఆదుకోవాలని అన్నారు.. అదేవిధంగా జూపాడుబంగ్లా మండలంలో అత్యధిక శాతం డి పట్టాదారులు నేసనల్ హైవే లో భూములు కోల్పోయారని వారికి నష్టపరిహారం చెల్లించి పనులు చేపట్టాలని, రైతులకు సమాచారం లేకుండా రోడ్డును వేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు. మంచాల మజారా సిద్దేశ్వరం గ్రామంలో గిరిజన కుటుంబాలు మౌలిక సదుపాయాలకు దూరంగా పూరి గుడిసెల్లో నివాసం ఉంటున్నారని అంధకారంలో బతుకులు కొనసాగిస్తున్నారని తక్షణమే వారికి విద్యుత్ సౌకర్యం పక్కా గృహాలు నిర్మించి అన్ని మౌలిక వసతులు కల్పించాలని వారు కోరారు.. ఆర్ బి కె కేంద్రాల్లో యూరియా అందుబాటులో లేకపోవడం వల్ల రైతుల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తక్షణమే ఆర్బికే కేంద్రాలకు యూరియా సరఫరా చేయాలని  కోరారు.పోతిరెడ్డిపాడు రోళ్ళపాడు ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా గుర్తించి అభివృద్ధి చేయాలన్నారు. పై సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకున్న కలెక్టర్  సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు మహానంది, వినోద్, తదితరులు పాల్గొన్నారు.

 

 

About Author