సీపీఐ నాయకుడికి గాయం.. వైసీపీ ఎంపీ వైద్యం !
1 min read
పల్లెవెలుగు వెబ్: తిరుపతి రాయలచెరువు వద్ద ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సీపీఐ నాయకుడు నారాయణ బుధవారం రాయలచెరువు సందర్శనకు వచ్చారు. ఈ క్రమంలో ఆయన అనుకోకుండా గాయపడ్డారు. విషయం తెలిసిన వెంటనే అక్కడకు చేరుకున్న తిరుపతి ఎంపీ డాక్టర్ గురిమూర్తి నారాయణకు వైద్యం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మార్గాని భరత్ రామ్ తన ట్విటర్‌లో షేర్ చేయగా.. ప్రస్తుతం ఈ ఫోటో వైరలవుతోంది. గురుమూర్తిపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజనులు.