NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బీసీల‌కు నామినేటెడ్ ప‌ద‌వుల్లో అన్యాయం : అచ్చెన్న

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : నిధులు, అధికారాలు ఉన్న ప‌ద‌వులు సీఎం జ‌గ‌న్ సొంత సామాజిక‌ వ‌ర్గానికి ఇచ్చి.. ప్రాధాన్యత‌లేని ప‌ద‌వులు బ‌ల‌హీన‌వ‌ర్గాలకు ఇచ్చార‌ని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమ‌ర్శించారు. వైకాపా రాజ‌కీయ నిరుద్యోగుల‌కు ప‌ద‌వులు క‌ట్టబెట్టడంలో ఉన్న శ్రధ్ద.. విద్యావంతులైన నిరుద్యోగుల పై లేద‌ని అన్నారు. బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ మంత్రుల‌ను డ‌మ్మీలుగా చేశార‌ని, నామినేటెడ్ ప‌ద‌వుల్లోనూ వివ‌క్ష చూపించార‌ని విమ‌ర్శించారు. బీసీలకు స్థానిక సంస్థల్లో అవ‌కాశాల‌ను దెబ్బతీశార‌ని అన్నారు. ఇళ్లప‌ట్టాల పేరుతో 10వేల ఎక‌రాల బీసీల భూములు లాక్కున్నార‌ని ఆరోపించారు. దాడులు, అత్యాచారాలు, హ‌త్యల‌తో రాష్ట్రంలో బ‌డుగులు బ‌తికే ప‌రిస్థితి లేకుండా చేశార‌ని అన్నారు.

About Author