NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బడ్జెట్ లో కర్నూలు జిల్లాకు అన్యాయం..

1 min read

ఆర్డీఎస్,వేదవతి, గుండ్రేవుల నీటి ప్రాజెక్టులకు మొండి చేయి సిపిఐ

ఎమ్మిగనూరు, న్యూస్​ నేడు:  ఎమ్మిగనూరు పట్టణంలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో కర్నూలు జిల్లా అభివృద్ధికి నిధులు కేటాయించకపోవడం దగాకోరు తనానికి నిదర్శనమని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో సోమవారం రోజున సోమప్ప సర్కిల్ నందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగిందనీ భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) నాయకులు తిమ్మ గురుడు,కె.సీ జబ్బర్, రాజీవ్, తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు పూర్తయిందనీ ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో ఫిబ్రవరి 28వ తేదీ నాడు 2025-26 సంవత్సరానికి ఆర్థిక శాఖ మంత్రి  ప్రవేశపెట్టిన బడ్జెట్లో కర్నూలు జిల్లాకు తీరని అన్యాయం జరిగింది . ఎన్నికల సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే సాగునీటి ప్రాజెక్టులు వేదవతి, ఆర్డీఎస్ కుడి కాలువ,గుండ్రేవుల, రిజర్వాయర్ ప్రాజెక్టుకు మరియు గురు రాఘవేంద్ర ప్రాజెక్టుకు నిధులు కేటాయించి పూర్తిచేసి కరువు వలసలు నివారిస్తామని ఆమె ఇవ్వడం జరిగిందనీ వారు తెలిపారు. ప్రస్తుతం బడ్జెట్లో నిధులు కేటాయింపులు చేస్తారని జిల్లా ప్రజలు ఆశించారు. సాగునీటి ప్రాజెక్టుకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వకుండా నిధులు కేటాయించకుండా ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించారు.జిల్లాలో పశ్చిమ ప్రాంతం పూర్తిగా కరువు కాటకాలకు నిలయంగా మారి సాగునీరు,త్రాగునీరు దొరకక ప్రజలు అలమటిస్తున్నారనీ  ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి 13 జిల్లాల్లో సోషల్ ఎకనామిక్ సర్వే తెలిపిన నివేదికలో రాష్ట్రంలోనే అత్యధికంగా పేదరికం ఉన్న జిల్లాగా నమోదు కావడం చాలా ప్రమాదకరం, ఇటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో కర్నూలు జిల్లా అభివృద్ధికి,సాగునీటి ప్రాజెక్టులు వేదవతి,ఆర్డిఎస్ కుడి కాలువ, గుండ్రేవుల రిజర్వాయర్,ఎల్ ఎల్ సి హెచ్ ఎల్ సి కాలువ లకు, జిల్లాలో అన్ని ప్రాంతాల్లో నూతన పరిశ్రమల ఏర్పాటుకు అధిక నిధులు కేటాయించి రాష్ట్ర ప్రభుత్వం జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరంఉందనీ. పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేస్తే లక్షలాది ఎకరాలకు సాగునీరు ప్రజలకు త్రాగు నీరు లభిస్తుంది.బడ్జెట్లో సాగునీటి ప్రాజెక్టులకు జిల్లా సమగ్ర అభివృద్ధికి 10 వేల కోట్ల రూపాయలు నిధులు కేటాయించి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత బడ్జెట్ సమావేశాలలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో వేదవతి ఆర్డీఎస్ కుడి కాలువ ఎల్.ఎల్.సి కి కేవలం 30 కోట్లు విదిల్చి చి చేతులు దులుపుకోవడం  చాలా అన్యాయం,కే.సీ.కెనాల్  ఆయకట్టు భూములకు పూర్తిస్థాయిలో సాగునీరు, కర్నూలు నగరానికి త్రాగునీరు అందించాల్సిన గుండ్రేవుల రిజర్వాయర్ ప్రాజెక్టుకు బడ్జెట్లో  గుండు సున్న చుట్టారు.దీని కారణంగా రాబోయే కాలంలో జిల్లా మరింత వెనుకబాటుకు గురవుతుంది. బడ్జెట్ సమావేశాలలో సవరణలు చేసి జిల్లా అభివృద్ధికి, సాగునీటి  ప్రాజెక్టులు పూర్తి చేయడానికి,నూతన పరిశ్రమలు ఏర్పాటుకు నిధులు కేటాయించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు విజేంద్ర, వీరేష్, మాలిక్, నరసింహారెడ్డి, ఖాజా, నరసింహులు,హనుమంతు, వెంకటేష్,ఇస్మాయిల్, లోకేష్, నాగరాజు,జయన్న, ఆంజనేయులు, రఫీ,నాయుడు, విజయ్,తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *