PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీలో నూత‌న విద్యావిధానం

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ఏపీలో నూత‌న విద్యావిధానం అమలు చేసే దిశ‌గా విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న 10+2 విధానం స్థానంలో 5+3+3+4 విధానం అమ‌లులోకి రానుంది. జాతీయ నూత‌న విద్యావిధానాన్ని అనుస‌రించి .. రాష్ట్ర ప‌రిస్థితుల‌కు అనుగుణంగా ప్రభుత్వం కొత్త విద్యావిధానానికి శ్రీకారం చుట్టింది.
నూత‌న విధానం:

  • ఈ విధానంలో మూడు ర‌కాల విద్యా వ్యవ‌స్థలు ఉంటాయి.
  • ప్రాథ‌మిక పాఠ‌శాలల్లో ఇక నుంచి ప్రీప్రైమ‌రీ-1, ప్రీప్రైమ‌రీ-2, ప్రిప‌రేట‌రీ ఫ‌స్ట్ క్లాస్, 1వ‌త‌ర‌గ‌తి, 2వ త‌ర‌గ‌తితో పాటు ఉంటాయి. వీటిని ఫౌండేష‌న్ స్కూళ్లుగా పిలుస్తారు.
  • ప్రిలిమ‌న‌రీ స్కూల్లు 3,4,5 త‌ర‌గ‌తులు, మిడిల్ స్కూల్లు 6,7,8 త‌ర‌గ‌తులు, 9,10,11,12 త‌ర‌గ‌తులు సెకండ‌రీ స్కూలుగా పిలుస్తారు.

About Author