PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇన్​ఫుట్​ డీలర్లు..సాంకేతిక నైపుణ్యం పెంపొందించుకోవాలి

1 min read

అగ్రికల్చర్​ జిల్లా ఉన్నత అధికారిణి వరలక్ష్మి, ఆత్మ డిప్యూటీ పీడీ శ్రీలత,

పల్లెవెలుగు:రైతుల సంక్షేమార్థం… వ్యవసాయ సమాచారాన్ని సాంకేతిక నైపుణ్యంతో ఎప్పటికప్పుడు అన్నదాతలకు అందించడానికి ఇన్​పుట్​ డీలర్లు కృషి చేయాలని అగ్రికల్చర్​ జిల్లా వ్యవసాయ అధికారిణి ​ వరలక్ష్మి సూచించారు. డిప్లొమా ఇన్​ అగ్రికల్చర్​ ఎక్స్​టెన్షన్​ సర్వీసెస్​లో  (నందికొట్కూరు 2023–24 బ్యాచ్​) శిక్షణ తీసుకున్న  ఇన్​పుట్​ డీలర్లకు మంగళవారం ఆత్మ డిప్యూటీ పీడీ శ్రీలత నేతృత్వంలో అగ్రికల్చర్​ జిల్లా వ్యవసాయ అధికారిణి వరలక్ష్మి సర్టిఫికెట్లు అందజేశారు.  ఈ సందర్భంగా  వరలక్ష్మి మాట్లాడుతూ ఇన్​పుట్​ డీలర్లు సాంకేతిక నైపుణ్యం మరింత పెంపొందించుకుని.. రైతులకు మెరుగైన సేవలు అందించాలన్నారు. కార్యక్రమంలో నందికొట్కూరు ఏడీఏ విజయ్​ శేఖర్​,  ఏడీఏసీ, డీఆర్​సీ వెంకటేశ్వర్లు, ఆత్మ ఏఓ మధుమతి, రిటైర్డు ఏడీ వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author