హలో.. గుడ్ మార్నింగ్ రైల్వే కోడూరు
1 min readఉదయం 6 గంటలకే పర్యటించిన ప్రభుత్వ విప్ శ్రీనివాసులు
– ప్రజా సమస్యలపై ఆరా..
పల్లెవెలుగు వెబ్, చిట్వేలి: సంక్షేమ పథకాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు మంగళవారం ఉదయం 6 గంటల నుంచి చిట్వేల్ టౌన్ 5,8,9,11 వార్డులలో ఆయన పర్యటించారు. బ్రాహ్మణ వీధి, గాజుల వీధి, సింగనమాల వీధి, తదితర వీధులలో అన్ని శాఖల అధికారులు, పార్టీ నాయకులతో కలిసి పర్యటించిన ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు.. ప్రజా సమస్యలు తెలుసుకుని.. అక్కడే ఉన్న అధికారులను పరిష్కరించాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారానికి ఉన్న అడ్డంకుల పై ఆరా తీశారు.
అర్హులకు.. పథకాలు అందాల్సిందే..
అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేయాలని అధికారులకు, సచివాలయ సిబ్బందికి ఎమ్మెల్యే శ్రీనివాసులు సూచించారు. ఇంటింటి పర్యటనలో వైఎస్ఆర్ ఆసరా, చేయూత, సున్నావడ్డీ, ఆమ్మఒడి, కాపు నేస్తం, నేతన్న నేస్తం, ఇంటిపట్టాలు, పక్కా గృహాలు తదితర ప్రభుత్వాలు అందాయా అని ఆయన అడిగి తెలుసుకున్నారు. నెలనెలా ఒకటో తేదీనే పొద్దు పొడవక ముందే పెన్షన్లును ఇంటికే తెచిస్తున్నారు నాయనా… అంటూ అవ్వా తాతలు చెప్పడంతోపాటు.. సీఎం జగన్ బాబు చల్లంగా ఉండాలంటూ ఆశీర్వదించారు. ప్రతిపల్లె లోనూ డ్రైనేజీ కాలువలు, సిమెంట్ రోడ్లు నిర్మిస్తామని ఎమ్మెల్యే శ్రీనివాసులు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అధికారులు, మండల కన్వీనర్ శ్రీనివాస్ రెడ్డి, మోహన్ రెడ్డి, మహేష్ రెడ్డి, రమణ,లక్ష్మికర్, గులాం భాష, నాగిరెడ్డి, సర్పంచ్ ఈశ్వర్య,రమణ రెడ్డి, స్థానిక నాయకులు, మండల నాయకులు పాల్గొన్నారు.