జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ
1 min readపల్లెవెలుగు వెబ్: అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్ లో రఘురామ దాఖలు చేసిన రిజాయిండర్ల పై రిప్లయిలు దాఖలు చేస్తామని జగన్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. రిజాయిండర్ల పై లిఖితపూర్వక వివరణ అవసరం లేదని న్యాయస్థానం తెలిపింది. మధ్యాహ్నం 2 గంటలకు ఇరువైపులా వాదనలు వినిపించాలని కోర్టు ఆదేశించింది.