వర్చువల్ రియాల్టీలో అవిభక్త కవలలను వేరు చేశారు !
1 min readపల్లెవెలుగువెబ్ : బ్రెజిల్ వైద్యులు అద్భుతం చేశారు. నాలుగేళ్ల క్రితం పుట్టిన అవిభక్త కవలలను విజయవంతంగా వేరు చేశారు. దాదాపు 100 మంది వైద్యులు వర్చువల్ రియాలిటీ విధానంలో 27 గంటల పాటు కష్టించి 9 సర్జరీలతో ఇరువురి తలలను వేరు చేశారు. జూన్ 7-9 మధ్య జరిగిన ఈ ఆపరేషన్ వివరాలను వైద్యులు బుధవారం వెల్లడించారు. ఆర్థర్, బెర్నార్డో లిమా అనే ఆ ఇద్దరు మగ శిశువులు 2018లో కపాలం కలిసిపోయి అవిభక్తంగా జన్మించారు. రెండేళ్ల క్రితం వాళ్లను తల్లిదండ్రులు ఆస్పత్రిలో చేర్పించగా.. లండన్‌కు చెందిన ఓ చారిటీ సంస్థ ఆపరేషన్ ఖర్చును భరించింది.